న్యూస్‌రీల్
అర్హులకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు
బుధవారం శ్రీ 3 శ్రీ జూన్ శ్రీ 2026
వికారాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలిపే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. సంక్షేమ ఫలాలు, ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ అందాలన్నదే సర్కార్ లక్ష్యమని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. కలెక్టర్ దీపక్‌తివారి, ఎస్పీ స్నేహ మెహ్రతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయా పాఠశాలలు, గురుకుల, మోడల్ స్కూల్, సంఘం లక్ష్మీబాయి పాఠశాల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను అధికారులతో కలిసి తిలరించారు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. పోలీస్ పరేడ్, జాగిలాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమరులకు నివాళి అర్పించి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అనిచివేతకు, దోపిడీకి గురైందని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే తప్ప తమ రాతమారదని గ్రహించి తెలంగాణ ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించడంతో 2014 జూన్ 2వ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందన్నారు.
నిరంతరం పథకాల అమలు
అర్హులందరికీ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని.. పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని సభాపతి అన్నారు. సాగు భూములకు రైతు భరోసా పేరిట ఎకరాకు రూ.12 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందన్నారు.
ప్రజాపాలనతో అన్ని వర్గాలకు సమాన అవకాశాలు
ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలుపుదాం
రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
ప్రసంగంలోని ముఖ్యాంశాలు..


