స్పీకర్ ప్రసాద్‌కుమార్
అనంతగిరి: డిగ్రీ కళాశాల అభివృద్ధికి కావాల్సిన నిధులు మంజూరు చేస్తానని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను పట్టణంలోని డైట్ కళాశాల ప్రాంగణంలోకి మార్చారు. ఇదివరకు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలో ఆవరణలో కొనసాగేది. సౌకర్యాల లేమితో విద్యార్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో.. మార్పు అనివార్యం అయింది. సొంత భవనం పూర్తయ్యే వరకు అక్కడ కొనసాగనుంది. ఈ మేరకు శుక్రవారం తరగతులను స్పీకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొ.గీతాలక్ష్మి పట్నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యనారాయణ, పీఏసీఎస్ మాజీ చైర్మన్ కిషన్‌నాయక్ పాల్గొన్నారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణంలో మున్సిపల్ పార్కు సమీపాన ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. మృతుడు బషీరాబాద్ మండల వాసిగా గుర్తించారు. వయసు 60 ఏళ్ల వరకు ఉంటుందని, భిక్షాటన చేస్తూ జీవించేవాడని తెలుసుకున్నారు. ఈ క్రమంలో తాగుడుకు బానిసై అనారోగ్యంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు. కుటుంబీకులకు సమాచారం అందించామని, ఇంకా ఫిర్యాదు అందలేని సీఐ రఘుకుమార్ తెలిపారు.
ఫోర్జరీ సంతకంపై ఫిర్యాదు
మంచాల: మహిళా పొదుపు సంఘాల్లో జరిగిన అక్రమాలపై పీడీ ఆదేశాల మేరకు చర్యలు తప్పవని మంచాల ఏపీఎం శేఖర్ అన్నారు. మండలంలోని చెన్నారెడ్డిగూడ గ్రామంలో పద్మావతి పొదుపు సంఘానికి సంబంధించిన వీఏఓగా పని చేస్తున్న ఎండీ జహంగీర్‌బీని ఫోర్జరీ సంతకాలు చేసి ఓ మహిళ సభ్యురాలు ద్వారా బ్యాంకు నుంచి గతేడాది సెప్టెంబర్‌లో రూ.50 వేలు తీసుకున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు గ్రామసభలో మరోసారి ప్రస్తావించారు. అక్రమాల విషయంలో నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై శుక్రవారం ఏపీఎం శేఖర్ మాట్లాడుతూ.. ఫోర్జరీ సంతకాలు చేసి అక్రమంగా డబ్బులు విషయం వాస్తవమే అన్నారు. తిరిగి ఆమె ద్వారా డబ్బులు చెల్లించిందని చెప్పారు. ప్రజల డిమాండ్ మేరకు పీడీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లామని చెప్పారు. వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
తెలంగాణపైసన్‌రైజర్స్ చిన్న చూపు
ఎస్‌ఆర్‌హెచ్ కార్యాలయం ఎదుట ధర్నా
సాక్షి, సిటీబ్యూరో: దేశవాళీ క్రికెట్ పోటీల్లో సత్తా చాటుతున్న తెలంగాణ ప్లేయర్లను సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఎందుకు చిన్న చూపు చూస్తోందో ఆ జట్టు యజమాని కావ్య మారాన్ సమాధానం చెప్పాలని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) వ్యవస్థాపక అధ్యక్షుడు, శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని ఎస్‌ఆర్‌హెచ్ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ ప్రతినిధి నగేష్‌కు వినతిపత్రం సమర్పించారు. ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి సుమారు 100 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా ఒక్కరిని కూడా కొనుగోలు చేయకపోవడం అన్యాయమని విమర్శించారు. ఆరోన్ జార్జ్, అమన్‌రావు వంటి తెలంగాణ యువ ప్లేయర్లను ఎందుకు వేలంలో ఎస్‌ఆర్‌హెచ కొనుగోలు చేయలేదని నిలదీశారు. ఎస్‌ఆర్‌హెచ్‌కు తెలంగాణ డబ్బులు, మౌలిక వసుతులు కావాలి కానీ, ఇక్కడి స్థానిక ప్లేయర్లకు కనీస అవకాశాలు ఇవ్వరా? అని ప్రశ్నించారు. తెలంగాణపై ఎస్‌ఆర్‌హెచ్ సవతి తల్లి ప్రేమను కట్టిపెట్టాలని అన్నారు. ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు రాజేష్, ప్రశాంత్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.


