అగ్ని ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదం

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

చందానగర్‌: విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌లో విద్యుదాఘాతం ఏర్పడటంతో కొండాపూర్‌ డివిజన్‌ పరిధిలోని మార్తాండనగర్‌లో మంగళవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న ఆటో, రెండు ద్విచక్రవాహనాలకు మంటలంటుకుని దగ్ధమయ్యాయి. పక్కన ఉన్న రెండు భవనాలు మంటలకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. వెంటనే బస్తీ ప్రజలు స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక మాజీ కార్పొరేటర్‌ హమీద్‌ పటేల్‌ సంఘటనాస్థలానికి చేరుకొని అధికారులతో మాట్లాడి త్వరతగతిన విద్యుత్‌ను పునరుద్ధరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement