తాండూరు రూరల్: మండల పరిధిలోని కోత్లాపూర్ శివారులోని రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్‌గా పట్లోళ్ల ప్రవీణ్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం ఉదయం 11:30 గంటలకు నూతన చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారు.
రోడ్డు నిర్మాణానికి
రూ.289 కోట్లు
● కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ
కన్వీనర్ పురుషోత్తంరావు
తాండూరు: నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందల కోట్ల నిధులతో అభివృద్ధి జరగడం హర్షణీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు మంగళవారం పేర్కొన్నారు. 102 కిలో మీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.289 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. మే నెలలో సీఎం రేవంత్‌రెడ్డి తాండూరు నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు తెలిపారు. సీఎంతో పాటు ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డిల హాజరై అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పారు. కోకట్ గ్రామంలో కాగ్నానది బ్రిడ్జి నిర్మాణ పనులను సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేస్తారన్నారు. కోకట్ నుంచి చిలుకవాగు వరకు డివైడర్‌తో పాటు 13.83 కిలోమీటర్ల దూరం రోడ్డు పనులకు రూ.63 కోట్లు మంజూరయ్యాయన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కు
ఇప్పించండి సారూ..
అనంతగిరి: తనకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఇప్పించాలని మోమిన్‌పేట మండలం కోలుకుంద గ్రామానికి చెందిన నవాబ్ రాఘవేందర్‌రెడ్డి కోరారు. మంగళవారం వికారాబాద్‌లో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 10న తరకు సీఎంఆర్‌ఎఫ్ చెక్ వచ్చినట్లు మేసేజ్ వచ్చిందన్నారు. కాగా అట్టి చెక్ ఎక్కడ ఉందో.. ఎవరి దగ్గర ఉందో తనకు సమాచారం ఇవ్వడం లేదని తెలిపారు. ఈ విషయమై ఎంపీడీఓ, ఎంఆర్‌ఏ కార్యాలయం చుట్టూ తిరిగిన ఎవరూ సమాధానం చెప్పడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ చొరవ తీసుకుని చెక్ ఇప్పించగలరని ఆయన కోరారు.


