రేపటి నుంచి గ్రామసభలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి గ్రామసభలు

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేయాలి

కలెక్టర్‌ దీపక్‌ తివారి

అనంతగిరి: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్‌ 2వ తేదీ నుంచి గ్రామ, వార్డు సభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని కలెక్టర్‌ దీపక్‌ తివారి అధికారులకు సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కొత్త పథకాల గురించి ప్రజలకు వివరించాలన్నారు. మంగళవారం నగరం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామసభల నిర్వహణపై పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. కొత్తగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్‌ హర్ష్‌ చౌదరి, జెడ్పీ సీఈఓ సుధీర్‌, డీఆర్‌డీఓ శ్రీనివాస్‌, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ముఖ్య ప్రణాళిక అధికారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు

వేసవి కాలంలో తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్‌ దీపక్‌ తివారి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ 08416235291ను ఆయన ప్రారంభించారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు తాగునీటి సమస్యలపై పైనంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమములో పంచాయతీ రాజ్‌ ఈఈ రవికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement