ఇసుక రీచ్‌లపై నిఘా | - | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌లపై నిఘా

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

అక్రమంగా రవాణా చేస్తే చర్యలు

తాండూరు రూరల్‌

సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

బీషీరాబాద్‌: ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెంచామని తాండూరు రూరల్‌ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాగ్నానది ఇసుక రీచ్‌ల నుంచే అక్రమ రవాణా జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. అక్కడ గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. మంగళవారం బషీరాబాద్‌ ఠాణాను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ కేసులను ఛేదించాలని ఎస్‌ఐ శ్రీశైలం యాదవ్‌కు సూచించారు. మండలంలోని నావంద్గీ, గంగ్వార్‌, మంతట్టి ఇసుక రీచ్‌లతో పాటు ఎక్మాయి పెద్దవాగు, కంసాన్‌పల్లి వాగు, దామర్‌చెడ్‌, మైల్వార్‌ గ్రామాల్లో ఇసుక రవాణాపై బ్లూకోట్‌ పోలీస్‌ టీంలతో నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. రెండో సారి పట్టుబడితే ట్రాక్టర్‌లను జప్తు చేసి కోర్టుకు రాయడమే కాకుండా వాటి యజమానులపై క్రిమిల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన కేసులో దర్యాప్తు జరుగుతోందని, ఎవరినీ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే ఇసుక తీసుకెళ్లవచ్చని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణపై వాహనదారులకు అవగాహన కల్పించాలని పోలీసులకు సూచించారు. జీపులు, ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ఆర్టీఏ నిబ్బంధలను ఉలంఘిస్తే జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రైవేటు వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, ఈ విషయంలో ప్రయాణికులకు సైతం అవగాహన చేయాలన్నారు. అలాగే సైబర్‌ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement