అంబేడ్కర్‌ జీవితం ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జీవితం ఆదర్శనీయం

Apr 1 2026 8:24 AM | Updated on Apr 1 2026 8:24 AM

కుల్కచర్ల: అంబేడ్కర్‌ జీవితం అందరికీ ఆదర్శనీయమని మందిపల్‌ సర్పంచ్‌ నాగరాజు యాదవ్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రాందాస్‌ నాయక్‌ అన్నారు. మంగళవారం చౌడాపూర్‌ మండల కేంద్రంలో చలో కిష్టాపూర్‌ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువత అంబేడ్కర్‌ మార్గంలో ముందుకు సాగాలని సూచించారు. ఈ నెల 4న దోమ మండలం కిష్టాపూర్‌లో అంబేడ్కర్‌ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందన్నారు. బహుజన వాదులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో పరిగి మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ సురేందర్‌, పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర కార్యదర్శి మందిపల్‌ వెంకట్‌, అంబేడ్కర్‌ సంఘ అధ్యక్ష కార్యదర్శులు అశోక్‌, డీజే కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement