అనంతగిరి: వికారాబాద్ మున్సిపల్ బడ్జెట్ సమావేశం మంగళవారం ఉదయం 11గంటలకు చైర్‌పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన జరగనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశా రు. ఇప్పటివరకు బాధ్యతలు తీసుకోని నలుగురు బీజేపీ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
లారీ దగ్ధం
తాండూరు టౌన్: పట్టణ పరిధిలోని విలియంమూన్ చౌరస్తాలో నిలిపి ఉన్న ఓ లారీ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే లారీ చాలా వరకు కాలిపోయింది. ఈ విషయమై పట్టణ సీఐని వివరణ కోరగా లారీ పాడైపోవడంతో మరమ్మతుల అక్కడ ఉంచినట్లు తెలిపారు. షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయి ఉంటుందని తెలిపారు.


