కొడంగల్ రూరల్: నిరక్షరాస్యులైన మహిళా సంఘం సభ్యులకు ఇటీవల చదవడం, రాయడం, గణితం తదితర అంశాలపై(శిక్షణ) అందించారు. ఆదివారం మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో శిక్షణ పొందిన సభ్యులకు పరీక్షలు నిర్వహించారు. అంగడిరాయిచూర్, రావులపల్లి, పర్సాపూర్ తదితర గ్రామాల్లోని పరీక్ష కేంద్రాలను డీఆర్‌డీఏ డీపీఎం నర్సిములు పరిశీలించారు. మండలంలోని 25 గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా మొత్తం 345 మంది మహిళా సంఘాల సభ్యులు 3వ తరగతి పరీక్షలు రాశారని ఏపీఎం గోపాల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మకు అక్షరమాల కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధి సాధించడంతోపాటు అక్షరాస్యులుగా మార్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మహిళా సంఘం మండల అధ్యక్షురాలు అంజమ్మ, సీసీలు బసంత్‌కుమార్, వాణిశ్రీ, జి.రాములు, అరవింద్, గ్రామాల్లోని బుక్ కీపర్లు తదితరులు పాల్గొన్నారు.
అమ్మకు అక్షరమాల నిర్వహణ
అనంతగిరి: అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని తొమ్మిది కేంద్రాల్లో పరీక్షలు విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 183 మంది మహిళా సంఘలా నిరక్షరాస్యులు నమోదు చేసుకోగా అందులో 178 మంది పరీక్షలకు హాజరయ్యారని జిల్లా మెప్మా అధికారి గుజ్జరి రవికుమార్ తెలిపారు. పరీక్ష కేంద్రాలను వయోజన విద్యా జిల్లా ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్, మెప్మా టీఎంసీ వెంకటేష్, కో–ఆర్డినేటర్ నటరాజు, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పరీక్షకు హాజరైన మహిళా సంఘాల సభ్యులు


