కొడంగల్ రూరల్: రోడ్డు విస్తరణలో డబ్బాలు తొలగించడంతో జీవనోపాధి కోల్పోయిన చిరువారులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంఐఎం నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్‌బీ గుల్షన్ కోరారు. శనివారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ నందారం ప్రశాంత్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. చిరు వ్యాపారుల సమస్యలను చైర్మన్‌కు వివరించారు. స్పందించిన చైర్మన్ బాధితులకు అండగా ఉంటానని, వారం రోజుల్లో కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం చైర్మన్‌ను చిరువ్యాపారులు, గుల్షన్ సన్మానించారు. కార్యక్రమంలో ఎండీ సర్తాజ్ హుస్సేన్, సయ్యద్ మహమూద్, ఎండీ జహంగీర్, ఎండీ అక్తర్, ఎండీ కబీర్, నారాయణ, సుందర్, సయ్యద్ అర్షద్ అలీ ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.


