ఇరువర్గాలపై కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

ఇరువర్గాలపై కేసు నమోదు

Mar 27 2026 10:13 AM | Updated on Mar 27 2026 10:13 AM

తాండూరు టౌన్‌: రజక సంఘం జేఏసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.కృష్ణపై చేయి చేసుకున్న పట్టణ 22వ వార్డు కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ రామకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రజక సంఘం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు పలువురు సభ్యులు గురువారం తాండూరు డీఎస్పీ నర్సింగ్‌ యాదయ్యకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ పోలీసు స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఆర్డీఓ కార్యాలయ వెనుక ఉన్న గొల్లచెరువు దోభీఘాట్‌ ప్రహరీని మంగళవారం కౌన్సిలర్‌ రామకృష్ణ కూల్చివేశాడు. ఈవిషయమై కౌన్సిలర్‌ను ప్రశ్నిస్తుండగా కులం పేరుతో దూషిస్తూ రజక సంఘం జేఏసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పి.కృష్ణ, సంఘం పట్ట ణాధ్యక్షుడు చాకలి రాజులపై చేయి చేసుకున్నాడని తెలిపారు. కావున సదరు కౌన్సిలర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. ఇదిలా ఉండగా గోడ కూల్చివేత విషయమై రజక సంఘం సభ్యులు తనను అకారణంగా బూతులు తిట్టారని కౌన్సిలర్‌ రామకృష్ణ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement