చేపల వలకు చిక్కుకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపల వలకు చిక్కుకొని వ్యక్తి మృతి

Mar 27 2026 10:12 AM | Updated on Mar 27 2026 10:12 AM

తాండూరు రూరల్‌: చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి నీటి గుంతలో శవమై తేలాడు. ఈ సంఘటన మండలంలోని రాంపూర్‌మీదితండాలో గురువారం చోటు చేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్‌ఐ రాథోడ్‌ వినోథ్‌ కథనం ప్రకారం.. తండాకు చెందిన కమల్‌నాయక్‌(45) కూలీగా జీవిస్తున్నాడు. బుధవారం ఆయన రాంపూర్‌ గేటు సమీపంలోని నీటిగుంతలో చేపల వేటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. గురువారం ఉదయం నీటి గుంత వద్ద కమల్‌నాయక్‌ బట్టలు, చెప్పులు చూసిన స్థానికులు వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి స్థానికుల సాయంతో కమల్‌నాయక్‌ మృతదేహాన్ని బయటకు తీశారు. గుంతలో ఉన్న చేపల వలలో చిక్కుకొని మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement