తాండూరు టౌన్: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు పి.శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ కళాశాలల బంద్‌లో భాగంగా గురువారం తాండూరు పట్టణంలోని డిగ్రీ కళాశాలలను బంద్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో విద్యా రంగానికి బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందన్నారు. పలు ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, పలు ప్రొఫెషనల్ కళాశాలల్లో విద్యార్థులకు రావాల్సిన సుమారు రూ.10 వేల కోట్ల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను రాష్ట్ర సర్కారు విడుదల చేయకపోవడం సిగ్గు చేటన్నారు. భవిష్యత్ పోరాటం ఉధృతం చేస్తామన్నారు.


