పరిగి: ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించి వారి సంక్షేమానికి తోడ్పాటును అందించాలని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి కోరారు. గురువారం శాసనసభ వేదికగా ఉద్యమకారుల హక్కులపై ఆయన మాట్లాడారు. స్వరాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎంతో శ్రమించారన్నారు. వారిని ప్రభుత్వం గుర్తించి హైకోర్టు ఆదేశాల మేరకు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గుర్తింపు కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమంలో తాను సైతం పాల్గొన్నానని, మూడు రోజులు మంచినీరు ముట్టకుండా నిరాహార దీక్షను చేస్తే పోలీసులు అరెస్టు చేసి నిమ్స్‌కు తరలించారని చెప్పారు. అనంతరం వంద ఏళ్ల చరిత్ర కలిగిన పరిగి కోర్టులో కేసుల సంఖ్య పెరిగిందని, ఈ మేరకు అదనపు కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించిందన్నారు. ప్రభుత్వం స్పందించి పరిగిలో అదనపు కోర్టును ఏర్పాటు చేయాలని కోరారు.
ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


