భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు
డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్ యాదవ్
దుద్యాల్: పోలేపల్లి రేణుక ఎల్లమ్మ జాతర ఉత్సవాలు పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వైద్య సేవల ఏర్పాటుపై డిప్యూటీ డీఎంహెచ్‌ఓ రవీందర్‌యాదవ్ శనివారం పలు సూచనలు చేశారు. హకీంపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు డాక్టర్ వందనతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతరకు దాదాపుగా 2 లక్షలకు పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని అందుకు తగిన విధంగా వైద్య సేవలు అందించాలన్నారు. అవసరమైన చోట క్యాంపులు ఏర్పాటు చేసుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళిక ప్రకారం నడుచుకోవాలని సూచించారు. మందుల నిల్వలను సరిచూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ కృష్ణయ్య, సిబ్బంది తదితరులు ఉన్నారు.
కొత్త లేబర్ కోడ్‌లతో కార్మికులకు అన్యాయం
సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాములు
కొత్తూరు: కార్మికచట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న నాలుగు లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కరాములు డిమాండ్ చేశారు. మున్సిపల్ పరిధిలోని తిమ్మాపూర్‌లో ఉన్న ఓ రిసార్ట్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సవరణ బిల్లు, వీబీ రామ్‌జీ చట్టం, నాలుగు లేబర్‌కోడ్లను రద్దు చేయాలని వచ్చేనెల 16న దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమ్మెను జయప్రదం చేసేందుకు అన్ని కార్మిక సంఘాలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే కోడ్‌ల కారణంగా కార్మికులు అన్ని విధాలా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులు, ప్రజలు, రైతులకు నష్టం చేసే నూతన చట్టాల అమలును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రాజు, మల్లేష్, జైపాల్‌రెడ్డి, కిర్య, శ్రీకాంత్, శ్రీశైలం, హరికుమార్, సతీష్, శ్రీకాంత్, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాపోటీలతో స్నేహభావం పెంపు
ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
ఆమనగల్లు: యువత క్రీడల్లోనూ రాణించాలని ఫుడ్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని అయ్యప్పకొండ సమీపంలో నిర్వహిస్తున్న మహేశ్ స్మారక క్రికెట్ టోర్నమెంట్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడా పోటీల నిర్వహణతో యువతలో స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. క్రీడలతో శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని చెప్పారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను ప్రదర్శించేందుకు పోటీలు ఉపకరిస్తాయని ఆయన చెప్పారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు యాదవ్, టోర్నీ నిర్వాహకులు సతీశ్, ప్రసాద్, లక్ష్మణ్, స్థానిక నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, అంజినాయక్, ఒగ్గు మహేశ్, రాజు, రంజిత్, సుమన్, కిరణ్, గోపి తదితరులు పాల్గొన్నారు.
భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు


