వీబీ జీ రామ్‌జీ బిల్లు రద్దు చేయాలి
కొడంగల్ రూరల్: వీబీ జీ రామ్‌జీ బిల్లును వెంటనే రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని పునరుద్ధరించాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.వెంకటయ్య డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని మార్కెట్‌యార్డు సమీపంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుస్స చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధి పనులు ప్రారంభించాలని కోరారు. రోజు కూలి రూ.600 ఇవ్వాలన్నారు. ఏళ్లుగా కష్టపడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కొత్తగా నాలుగు కోడ్‌లు తీసుకురావడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పార్టీ నాయకులు మల్లయ్య, వెంకటయ్య, గుండప్ప, రాములు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటయ్య


