గంజాయి విక్రేతల అరెస్ట్
తాండూరు టౌన్: నిషేధిత గంజాయిని విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామని పట్టణ సీఐ సంతోష్ కుమార్ శనివారం తెలిపారు. తాండూరు పట్టణ శివారులోని మాధుర్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు గాంజాను విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు దాడి చేసి, ఎండీ ఫయాజ్ అబ్దుల్ ఖాన్, రఫీక్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి నుంచి 1.8 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
పట్టణ శివారులోని చెన్‌గేస్‌పూర్ రోడ్డులో శుక్రవారం అర్ధరాత్రి పేకాట స్థావరంపై దాడి చేశామని, అమీర్, ఇమ్రాన్, సద్దాం, అబ్దుల్ మెహరాజ్, జమీర్ అనే ఐదుగురిని అరెస్టు చేశామని సీఐ తెలిపారు. వారి నుంచి కొంత నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేశామని వెల్లడించారు.
1.8 కిలోలు స్వాధీనం


