సర్వేతో భూమి హక్కులకు భద్రత
పూడూరు: ప్రభుత్వం భూభారతి భూ సర్వే, రీ సర్వే ద్వారా రైతుల భూమి హక్కులకు పూర్తి భద్రత కల్పిస్తుందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని పోతిరెడ్డిగూడలో భూసర్వే రీసర్వేపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆధార్ కార్డు మాదిరి భూభారతిలో భూధార్ కార్డులు అందిస్తామన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారాని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీ మధుసూదన్, అదనపు కలెక్టర్ వాసుచంద్ర, తహసీల్దార్ విజయ్‌కుమార్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ యాదవరెడ్డి, మాజీ సర్పంచ్ షకీల్, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


