లాభాల సంక్రాంతి
రద్దీ మేరకు..
షాద్‌నగర్: సంక్రాంతి పండుగ ఆర్టీసీకి భారీగా ఆదాయం తెచ్చిపెట్టింది. ఇతర ప్రాంతాల్లో చదువుకుంటున్న విద్యార్థులు, ఉపాధి కోసం వెళ్లిన వలస జీవులు, ఉద్యోగులు, పట్టణాల్లో నివాసం ఉంటున్నవారు సొంతూళ్లకు వెళ్లారు. సంతోషంగా పండుగ ముగించుకుని తిరిగి తమ గమ్య స్థానాలకు చేరుకున్నారు. పది రోజుల పాటు బస్సులు, బస్టాండ్లు జనంతో కిటకిటలాడాయి.
పది రోజుల్లో రూ.2.18 కోట్లు
సంక్రాంతిని పురస్కరించుకుని షాద్‌నగర్ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు కేటాయించారు. ఈనెల 10 నుంచి 19వ తేదీ వరకు నడిపించిన బస్సులతో భారీగా ఆదాయం సమకూరింది. పది రోజుల్లో 3,27,000 కిలోమీటర్లు తిరిగిన బస్సులతో 3,94,505 మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారు. దీంతో రూ.2.18 కోట్ల రాబడి వచ్చింది. పండగ సెలవుల ప్రారంభం రోజు 10న రూ.24 లక్షలు, చివరి రోజు 19న రూ.34 లక్షలకు పైగా సమకూరింది.
మహిళా ప్రయాణికులే అధికం
మహిళలకు ఉచిత బస్సు పథకంతో సంక్రాంతి వేళ భారీ సంఖ్యలో మహిళలు బస్సుల్లో ప్రయాణించారు. పది రోజుల్లో మొత్తం 3,94,505 మంది ప్రయాణించగా అందులో మహిళలు 2,39,972 మంది ఉండడం గమనార్హం
ఆర్టీసీకి దండిగా ఆదాయం
పది రోజుల్లో పండుగేపండుగ
షాద్‌నగర్ డిపోకు రూ.2.18 కోట్ల రాబడి
పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక బస్సులు నడిపించాం. పది రోజుల్లో డిపోకు రూ.2.18 కోట్ల ఆదాయం వచ్చింది. మహిళా ప్రయాణికులు అధికంగా బస్సుల్లో ప్రయాణించారు.
– ఉష, డిపో మేనేజర్, షాద్‌నగర్
లాభాల సంక్రాంతి


