ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
షాద్‌నగర్‌రూరల్: షాద్‌నగర్ మున్సిపాలిటీని ఆ దర్శంగా తీర్చిద్దిదడమే లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం పట్టణంలోని ఈడెన్ ప్లాజా ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు యుద్ధప్రాతిపదికన అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అస్తవ్యస్తంగా మారిందని, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన, రెండేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో వ్యత్యాసం ఏమిటో ప్రజలే గ్రహిస్తున్నారన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మంచి చేసేవారికి ఓటువేసి న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపించాలని కోరారు. మాకు ఎవరు నాయకులు లేరని, ప్రజలే మాకు బాసులని, వాళ్లు చెప్పిందే మాకు వేదమన్నారు. అవినీతికి దూరంగా, అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన అందిస్తున్నామన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకోసం పనిచేసే నాయకులకే టికెట్ ఇస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్‌రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యులు శ్యాంసుందర్‌రెడ్డి, తాండ్ర విశాలశ్రావణ్‌రెడ్డి, నాయకులు కాశీనాథ్‌రెడ్డి, అగ్గనూరు విశ్వం, వన్నాడ ప్రకాశ్‌గౌడ్, మహ్మద్ అలీఖాన్‌బాబర్, శివశంకర్‌గౌడ్, కృష్ణారెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, బాల్‌రాజ్‌గౌడ్, సర్వర్‌పాషా, దామోదర్‌రెడ్డి, బస్వం, అందె మోహన్, ఖాజాఇద్రీస్‌అహ్మద్, రఘునాయక్, పురుషోత్తంరెడ్డి, జితెందర్‌రెడ్డి, కొమ్ముకృష్ణ, మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్


