లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి సురేష్‌కుమార్
కొడంగల్ రూరల్: రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలకు శాపంగా మారిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి గంటి సురేష్‌కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. రైతులకు నష్టం చేసేలా కేంద్ర ప్రభుత్వం విత్తన చట్ట సవరణ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీ పేరిట ఉన్న ఉపాధి హాహీ చట్టాన్ని వీబీ.రాంజీ పేరుతో బలహీనం చేశారని పేర్కొన్నారు. కొత్త చట్టంలో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం, 60 శాతం కేంద్రం పరిధిలోకి తెచ్చిందని, దీంతో రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశా రు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు బాబు, సావిత్రమ్మ, శ్యామప్ప, మల్కప్ప, శంకర్ నాయక్, శైలజ, కనకప్ప, పాండ్యనాయక్, ఆశమ్మ, హనుమంతు, నరహరి పాల్గొన్నారు.
తాగునీటి కటకట
తాండూరు టౌన్: పట్టణ పరిధిలోని పాత తాండూరులో తాగునీటి సమస్య నెలకొంది. 20 రోజులుగా ఇబ్బంది పడుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటి పైప్‌లైన్ పగిలిపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం పిల్లర్ గుంతలు తీస్తున్న క్రమంలో పైపులైన్ ధ్వంసమైంది. మున్సిపల్, ఆర్‌అండ్‌బీ అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపించారు. వెంటనే మరమ్మతుల చేపట్టి నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ బరిలో ఉంటాం
బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్
చంద్రశేఖర్ ముదిరాజ్
తాండూరు టౌన్: రానున్న మున్సిపల్ ఎన్ని కల్లో తాండూరు పట్టణంలోని అన్ని వార్డుల్లో బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్‌చార్జ్ అమ్జద్ అలీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ముఖ్య ఉద్దేశంతో బీఎస్పీ కొనసాగుతోందన్నారు. పట్టణ ప్రజలు తమ అభ్యర్థులను ఆదరిస్తారని, ఎన్నికల్లో తప్పకుండా అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుకుమార్, మంచాల శ్రీకాంత్, అసెంబ్లీ ఇంచార్జి నవీన్ యాదవ్, ఉపాధ్యక్షులు కృష్ణయ్యగౌడ్, పట్టణ ఇన్‌చార్జ్ అమ్జద్ అలీ, ఆమీర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
పరిగి: మండలంలోని జాఫర్‌పల్లి మోడల్ స్కూల్‌లో 2026 –27 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపాల్ భాగ్యలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని, పదో తరగతి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఖాళీలు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ నెల 28నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు.
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి
లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి


