రిజర్వేషన్.. టెన్షన్..!
తాండూరు: మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. నేడు వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్నీ సిద్ధం చేశారు. రెండు రోజుల క్రితమే ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ స్థానాల వారీగా రిజర్వేషన్లను ప్రకటించారు. త్వరలో మున్సిపల్ చైర్మన్ల రిజర్వేషన్లు వెలువడనున్నాయి. దీంతో ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది.
నాలుగు మున్సిపాలిటీలు..
జిల్లాలో తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. తాండూరులో 36 వార్డులు, వికారాబాద్‌లో 34, పరిగిలో 18, కొడంగల్‌లో 12 వార్డులు ఉన్నాయి. 2020లో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను బీఆర్‌ఎస్ కై వసం చేసుకుంది. ప్రస్తుతం జిల్లాలోని నాలుగు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో ఎలాగైనా నాలుగు మున్సిపాలిటీలను తమ ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైతం పట్టు నిలుపుకొనేందుకు పావులు కదుపుతున్నారు.
మున్సిపాలిటీల వారీగా రిజర్వేషన్లు ఇలా..


