మున్సిపల్ అభివృద్ధికి నిధులు
మొయినాబాద్ రూరల్: మున్సిపల్ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నారని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ఆయన మున్సిపల్ కమిషర్ ఖాజామొయిజుద్దీన్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తోందన్నారు. ఎన్కేపల్లి వార్డుకు రూ.1.18 కోట్లు, ముర్తూజగూడకు రూ.1.19 కోట్లు, సురంగల్‌కు రూ.85 లక్షలు, మొయినాబాద్‌కు రూ.90 లక్షలు, పెద్దమంగళారంలో రూ.1.92 కోట్లు, అప్పోజీగూడకు రూ. 95 లక్షలు, చిలుకూరు రూ.1.41 లక్షలు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో సీసీ, బీటీ రోడ్లను అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జమీల్, డీఈ చిరంజీవులు, పీసీసీ కార్యవర్గ సభ్యుడు దర్శన్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అమర్‌నాథ్ రెడ్డి, ఎన్కేపల్లి నాయకులు శ్రీశైలం, చంద్రయ్య, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీకాంత్, కాంగ్రెస్ నాయకులు జైపాల్ రెడ్డి, మల్లేశ్‌యాదవ్, అశోక్‌యాదవ్, హన్మంత్ యాదవ్, రవీందర్ రెడ్డి, రామకృష్ణగౌడ్, సరికొండ అనంతరెడ్డి, మల్లారెడ్డి, అశోక్ యాదవ్, నాగేందర్ గౌడ్, గడ్డం వెంకట్ రెడ్డి, జైపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య


