నేడు రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశం | - | Sakshi
Sakshi News home page

నేడు రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశం

Jan 17 2026 11:44 AM | Updated on Jan 17 2026 11:44 AM

నేడు

నేడు రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశం

అనంతగిరి: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావే శం ఉంటుందని కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మున్సిపల్‌ వార్డుల రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన వివరాల ను సమావేశంలో తెలియజేయనున్నట్లు తెలిపా రు. జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల అధ్య క్షులు, జనరల్‌ సెక్రటరీలు ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకోవాలని సూచించారు.

అన్ని వార్డుల్లో పోటీ చేస్తాం

కొడంగల్‌ రూరల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధం కావాలని ఎంఐఎం పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి, కొడంగల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ.గుల్షన్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో కొడంగల్‌ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు పోటీలో ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో ఎండీ సర్తాజ్‌ హుస్సేన్‌, షేక్‌ రోమన్‌, సయ్యద్‌ ముస్తాఫా, ఎండీ అజహర్‌, ఎండీ అమీర్‌ హు స్సేన్‌, ఎండీ షానవాజ్‌ హుస్సేన్‌, ఎండీ రెహన్‌, సయ్యద్‌ అర్షద్‌ అలీ ఖాద్రి పాల్గొన్నారు.

నేడు రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశం 
1
1/1

నేడు రాజకీయ పార్టీలప్రతినిధులతో సమావేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement