చర్యలు తీసుకోండి.. న్యాయం చేయండి
మొయినాబాద్: గిరిజన కుటుంబాల ఇళ్ల కూల్చివేత వివాదం చినికిచినికి గాలివానలా మారింది. అది కాస్తా జాతీయ ఎస్టీ కమిషన్‌కు చేరింది. గురువారం మొయినాబాద్ ఠాణాలో ఫిర్యాదు చేసిన బాధితులు శుక్రవారం చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యుడు ఉషన్ నాయక్‌ను కలిసి తమ గోడు వినిపించారు. మున్సిపల్ కమిషనర్ భూమి తమదంటూ వచ్చిన శ్రీనివాస్‌రాజు, సురేష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఉషన్‌నాయక్ విషయాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. గిరిజనులందరికీ న్యాయం జరుగుతుందని.. ఎవరికీ భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఆయన్ను కలిసినవారిలో నాయకులు శ్రీకాంత్, సుదీంధ్ర, కృష్ణయాదవ్ తదితరులు ఉన్నారు.
ఇళ్ల కూల్చివేతపై ఎస్టీ కమిషన్ సభ్యుడికి ఫిర్యాదు


