చిత్రకళతో సీఎంకు శుభాకాంక్షలు
దౌల్తాబాద్: మండల పరి ధిలోని యాంకి గ్రామానికి చెందిన చిత్రకారుడు సున్నపు అశోక్ శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తన కళ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం సొంత నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపే చిత్రాలతో బొమ్మవేసి అభిమానం చాటుకున్నారు.
సీజనల్ వ్యాధులతో జాగ్రత్త
కొడంగల్ రూరల్: పశు వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జేవీఓ వెంకటయ్య సూచించారు. శుక్రవారం పట్టణంలోని తెలంగ్‌వాడలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూగజీవాలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎల్‌ఎస్‌ఏ శేఖర్, ఓఎస్ పద్మమ్మ, శివ, రైతులు పాల్గొన్నారు.
మందుల కొరత తీర్చండి
తాండూరు: మాతాశిశు ఆస్పత్రిలో మందుల కొరతను తీర్చాలని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వినయ్‌కుమార్ శుక్రవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్రను కోరారు. ఈమేరకు సిబ్బందితో కలిసివెళ్లి వినతిపత్రం అందజేశారు. జిల్లా ఆస్పత్రికి గతంలో కాయకల్ప అవార్డు వచ్చిందని, కానీ ఇందుకు సంబంధించిన ప్రైజ్‌మనీ అకౌంట్‌లో జమ కాలేదని తెలిపారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. డీఎంహెచ్‌ఓను కలిసిన వారిలో డాక్టర్ శ్రీకాంత్, సిబ్బంది ఉన్నారు.
శివాలయంలో కార్తీక శోభ
ధారూరు: కార్తీక మాసంను పురస్కరించుకొని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని శివాలయంలో శుక్రవారం ఓ మహిళ.. కోటి వత్తులను ఒకేసారి వెలిగించి వెళ్లిపోయింది. దీంతో ఆలయం పైకప్పు, గోడలు నల్లబడటాన్ని చూసి భక్తులు అవాక్కయ్యారు. రెండు రోజులుగా భక్తజనం 365 వత్తులతో దీపాలను వెలిగిస్తున్నారు.
ఐసీసీసీలో వందేమాతరం
సాక్షి, సిటీబ్యూరో: బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ప్రాంగణంలో శుక్రవారం వందేమాతరం గేయాన్ని ఆలపించారు. నగర కొత్వాల్ విశ్వనాథ్ చన్నప్ప సజ్జనర్ నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఉన్నతాధికారులు, పరిపాలనా విభాగం సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సమస్త జాతిని ఏకం చేసిన వందేమాతరం అనే సమర నినాదానికి 150 ఏళ్లు పూర్తయ్యాయని అన్నారు. ఈ గేయం ఉద్యమకారుల్లో ఉత్తేజాన్ని నింపిందని, సామాన్యులను సమరయోధులుగా మార్చిందని గుర్తుచేశారు.
చిత్రకళతో సీఎంకు శుభాకాంక్షలు
చిత్రకళతో సీఎంకు శుభాకాంక్షలు
చిత్రకళతో సీఎంకు శుభాకాంక్షలు
చిత్రకళతో సీఎంకు శుభాకాంక్షలు


