కాలేజీ బస్సులు ఢీ
డ్రైవర్‌తో పాటు విద్యార్థులకు స్వల్పగాయాలు
మొయినాబాద్: ఒకే కళాశాలకు చెందిన రెండు బస్సులు ఢీకొన్న సంఘటన మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్‌నగర్ చౌరస్తా వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎనికేపల్లి రెవెన్యూలోని జేబీఐటీ కాలేజీకి చెందిన బస్సులు శుక్రవారం సాయంత్రం విద్యార్థులను తీసుకుని నగరానికి వెళ్తున్నాయి. హిమాయత్‌నగర్ చౌరస్తాలోని పెట్రోల్ బంక్ వద్ద వెనక వెళ్తున్న బస్సు అదుపుతప్పి ముందు బస్సును ఢీకొట్టింది. దీంతో వెనక బస్సు ముందు అద్దం పగిలి డ్రైవర్‌తో పాటు పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మరో బస్సులో ఎక్కించి విద్యార్థులను ఇళ్లకు తరలించారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


