చురుగ్గా ఆడిటోరియం విస్తరణ పనులు
ధారూరు: మండలంలోని స్టేషన్‌ధారూరు – దోర్నాల్ గ్రామాల మధ్య మెథడిస్టు క్రిస్టియన్ జాతర పనుల్లో భాగంగా ఏసుక్రీస్తు ఆడిటోరియం విస్తరణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఈ నెల 11 నుంచి జాతర ప్రారంభం కానుంది. అంతలోగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆడిటోరియం చిన్నగా ఉండటంతో జాతరకు వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఎడమ వైపు 115 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు, కుడి వైపు 115 ఫీట్ల పొడవు, 52 ఫీట్ల వెడల్పుతో విస్తరణ పనులు చేపట్టారు. దీంతో మరో 5 వేల మంది భక్తులు కూర్చునేందుకు అవకాశం ఉంటుంది.
హుడా కాంప్లెక్స్: కొత్తపేటలోని పీవీటీ మార్కెట్ మర్చెంట్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులను పీవీటి మార్కెట్ ఫౌండర్స్ కమిటీ బుధవారం నియమించింది. అధ్యక్షుడిగా శ్రీధర్, ఉపాధ్యక్షులుగా కృష్ణ, సురేశ్, ప్రధాన కార్యదర్శిగా భరత్ రాజేంద్ర ప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా రోచారాజు, కోశాధికారి దివ్యజ్యోతి, కార్యవర్గ సభ్యులుగా ధనుంజయ్య, పాండురంగం, ప్రకాశ్, సీతామధు, వెంకటనారాయణ నియమితులయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
రేపటి నుంచి ఇక్ఫాయ్‌లో మోడల్ కాన్ఫరెన్స్
శంకర్‌పల్లి: ఇక్ఫాయ్ డీమ్డ్ వర్సిటీలో లా స్కూల్ ఆధ్వర్యంలో ‘మోడల్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్’కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాకేశ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7,8,9న నిర్వహించనున్న ఈ కాన్ఫరెన్స్‌ను మర్రి శశిధర్‌రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి
మహేశ్వరం: భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేసి ఆదుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆమె మండల పరిధిలోని కేసీ తండా కేజీబీవీ హాస్టల్, మహేశ్వరం మోడల్ స్కూల్ హాస్టల్ గదులను, రామచంద్రగూడ గ్రామంలో దెబ్బతిన్న పంటలను సందర్శించారు. ఈ సందర్బంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం కురిసిన భారీ వర్షానికి హాస్టల్ గదుల్లోకి నీరు చేరిందన్నారు. రామంచంద్రగూడలోని కోటిరెడ్డికుంట అలుగు పారవడంతో గ్రామంలో ఇళ్ల మధ్య నుంచి భారీగా వరద పారిందన్నారు. హాస్టల్ గదుల్లో చేరిన వరద నీటిని వెంటనే తొలగించాలని ఆదేశించారు. ఆమె వెంట పీఏసీఎస్ చైర్మన్ పాండు యాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు అంబయ్య యాదవ్, చంద్రయ్య, మోతీలాల్ నాయక్, రాజు నాయక్ ఉన్నారు.
చురుగ్గా ఆడిటోరియం విస్తరణ పనులు


