పెండింగ్ వేతనాలు చెల్లించండి
షాబాద్: మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్‌లో వేతనాలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అల్లి దేవేందర్ డిమాండ్ చేశారు. షాబాద్ బీపీటీ వద్ద మిషన్ భగీరథ కార్మికులు బుధవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2018 నుంచి మిషన్ భగీరథ కార్మికులు విధులు నిర్వహిస్తున్నా ఇప్పటి వరకు వేతనాలు పెంచలేదన్నారు. ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచడంతో పాటు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.


