ధారూరు మార్కెట్‌కు భారీగా మొక్కజొన్న | - | Sakshi
Sakshi News home page

ధారూరు మార్కెట్‌కు భారీగా మొక్కజొన్న

Oct 26 2025 9:19 AM | Updated on Oct 26 2025 9:19 AM

ధారూర

ధారూరు మార్కెట్‌కు భారీగా మొక్కజొన్న

ధారూరు: స్థానిక వ్యవసాయ మార్కెట్‌కు శనివారం రైతులు 3వేల బస్తాల మొక్కజొన్నలు తెచ్చారు. మార్క్‌ఫెడ్‌ అధికారులు క్వింటాలుకు రూ.2,400 మద్దతు ధర నిర్ణయించారు. బహిరంగ మార్కెట్‌లో క్వింటాలుకు తక్కువగా రూ.1,600, మధ్యస్థంగా రూ.1,900, ఎక్కువగా రూ.2,020 ధర పలికింది. రైతులు 1,598 బస్తాలను విక్రయించినట్లు మార్కెట్‌ కార్యదర్శి సిద్దమ్మ తెలిపారు. పెసర 21 బస్తాలు వచ్చాయని,క్వింటాలుకు తక్కువగా రూ.4 వేలు, మ ధ్యస్థంగా రూ.4,500,ఎక్కువగా రూ.5,800 చొప్పున ధర పలికినట్లు ఆమె తెలిపారు.

రేపే వైన్స్‌కు లక్కీ డ్రా

అనంతగిరి: జిల్లాలోని 59 మద్యం దుకాణాలకు సోమవారం లక్కీ డ్రా తీయనున్నట్లు జిల్లా ఎకై ్సజ్‌ అధికారి వినయ్‌భాస్కర్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వికారాబాద్‌ పట్టణంలోని బ్లాక్‌ గ్రౌండ్‌ పక్కనే గల అంబేడ్కర్‌ భవనంలో ఉదయం 10గంటలకు డ్రా తీయనున్నట్లు తెలిపారు. దరఖాస్తు దారులు సమయానికి రావాలని సూచించారు.

రైతు సంక్షేమమే ధ్యేయం

ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి

పూడూరు: రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు సాగుతోందని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని అంగడిచిట్టంపల్లిలోని ధరణి కాటన్‌ మిల్లులో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కిసాన్‌ యాప్‌లో పంట వివరాలు నమోదు చేసుకొని స్లాట్‌ బుక్‌ చేసుకోవాలని సూచించారు. అనంతరం మండలంలోని ఎన్కేపల్లి నుంచి మీర్జాపూర్‌ వరకు బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ సతీష్‌రెడ్డి, ఆత్మాకమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శులు అజీం పటేల్‌, శ్రీనివాస్‌, పెంటయ్య, షకీల్‌, పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్‌ తదితరులు పాల్గొన్నారు.

సమయపాలన పాటించాలి

పరిగి: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని మండల విద్యాధికారి గోపాల్‌ సూచించారు. శనివారం మండలంలోని రంగంపల్లి, గడిసింగాపూర్‌ ప్రాథమిక పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన బోధన చేయాలని సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించాలని ఆదేశించారు. గడిసింగాపూర్‌ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఏఐ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఏఐ తరగతులను క్రమం తప్పకుండా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ఆయ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

వైద్యవృత్తి పవిత్రమైనది

మండలి చీఫ్‌విప్‌ పట్నం మహేందర్‌రెడ్డి

చేవెళ్ల: వైద్యవృత్తి ఎంతో పవిత్రమైందని మండలి చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. చేవెళ్లలోని డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి జనరల్‌ ఆస్పత్రి, మెడికల్‌ కళాశాలలో శనివారం ‘అధ్యాయ 2025’ పేరుతో కళాశాల ఫెస్ట్‌ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వైద్య విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రజలకు మెరుగైన సేవలు అందించి మంచి వైద్యులుగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు. మెరుగైన వైద్యం అందించే వైద్యులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు. అనంతరం క్రీడల్లో, విద్యలో రాణించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ జోయారాణి, వైస్‌ ప్రిన్సిపాల్‌ రాజేశ్వర్‌రావు, అధ్యాపక బృందం, సిబ్బంది పాల్గొన్నారు.

ధారూరు మార్కెట్‌కు భారీగా మొక్కజొన్న 
1
1/2

ధారూరు మార్కెట్‌కు భారీగా మొక్కజొన్న

ధారూరు మార్కెట్‌కు భారీగా మొక్కజొన్న 
2
2/2

ధారూరు మార్కెట్‌కు భారీగా మొక్కజొన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement