దేశాన్ని పూర్వ స్థితికి తేవడమే సంఘ్‌ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

దేశాన్ని పూర్వ స్థితికి తేవడమే సంఘ్‌ లక్ష్యం

Oct 27 2025 8:54 AM | Updated on Oct 27 2025 8:54 AM

దేశాన

దేశాన్ని పూర్వ స్థితికి తేవడమే సంఘ్‌ లక్ష్యం

దేశాన్ని పూర్వ స్థితికి తేవడమే సంఘ్‌ లక్ష్యం ఓపెన్‌ స్కూల్‌ తరగతులను వినియోగించుకోవాలి మూన్‌వాకర్‌పై స్పెషల్‌ డాక్యుమెంటరీ

ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత సంఘ్‌ చాలక్‌ సుందర్‌రెడ్డి

ధారూరు: పంచ పరివర్తన ద్వారా సమాజ నిర్మాణంలో భాగస్వాములవ్వాలని వికారాబాద్‌ జిల్లా సహ సంఘ్‌చాలక్‌ గోవర్దన్‌ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ధారూరులో భారీ ర్యాలీ నిర్వహించి వీరభద్రేశ్వరస్వామి ఆలయ ఆవరణలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగబద్దమైన పౌరుల విధులను కాపాడాలని ఆయన సూచించారు. భారత్‌లోని యువత ఐకమత్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్వయం సేవకులు, యువత పాల్గొన్నారు.

రాష్ట్ర కోఆర్డినేటర్‌, జిల్లా పరిశీలకులు అరుణశ్రీ

పరిగి: ఓపెన్‌ స్కూల్‌ తరగతులను ప్రతీ ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఓపెన్‌ స్కూల్స్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌, జిల్లా పరిశీలకులు అరుణశ్రీ సూచించారు. ఆదివారం పట్టణ కేంద్రంలోని నంబర్‌–1 ఉన్నత పాఠశాల, నంబర్‌–2 ఉన్నత పాఠశాలల్లో జరుగుతున్న ఓపెన్‌ స్కూల్‌ తరగతులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓపెన్‌ స్కూల్‌ తరగతులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫ్యాకల్టీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన బోధన చేయాలని సూచించారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ప్రతి రోజు రెండు గంటల పాటు చదువుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి గోపాల్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

నవంబర్‌ 1న ఇండియా టీవీలో ప్రసారం

తాండూరు వాసి వంశీకృష్ణకు

దక్కిన అరుదైన అవకాశం

తాండూరు టౌన్‌: పట్టణంలోని వాల్మీకినగర్‌లో మూన్‌వాకర్‌గా పేరొందిన వంశీకృష్ణపై ప్రముఖ జాతీయ మీడియా ఇండియా టీవీలో నవంబర్‌ 1వ తేదీన డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. డ్యాన్సర్‌ మైఖేల్‌ జాక్సన్‌ను అనుసరిస్తూ పెరిగిన వంశీకృష్ణ మూన్‌వాక్‌తో పాటు పలు రకాల నృత్యాలు, యోగ, సింగర్‌, కరాటే సాధన వంటివి అలవర్చుకున్నాడు. గతంలో 2015లో మైఖేల్‌ జాక్సన్‌ పుట్టిన రోజైన ఆగస్టు 29న ఒక గంటలో 4.238 కిలోమీటర్లు మూన్‌వాక్‌ చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. 2016లో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణించిన దేశ ప్రముఖులతో పాటు వంశీకృష్ణ వివరాలు ప్రస్తావించారు. 2017 నవంబర్‌ 12న న్యూఢిల్లీలో సిరిఫోర్ట్‌ ఆడిటోరియంలో వివిధ దేశాల రికార్డు ప్రతినిధులచే అంతర్జాతీయ వీఐపీ హోదాని, 2019లో 315 పదాలతో ఏకధాటిగా ఫాస్టెస్ట్‌ ర్యాప్‌ సింగింగ్‌ చేసి రికార్డు సాధించాడు. 2021లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా 5 నిమిషాల 19 సెకండ్ల పాటు గరుడాసనం వేసి రికార్డు సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ఫాస్టెస్ట్‌ డబుల్‌ నాన్‌చాక్‌ను నిమిషంలో 218 సార్లు తిప్పి రికార్డు సృష్టించాడు. ఇలా పలు రికార్డులను సొంతం చేసుకున్న వంశీకృష్ణపై ఇండియా టీవీ ప్రత్యేక డాక్యుమెంటరీని చిత్రీకరించారు.

దేశాన్ని పూర్వ స్థితికి తేవడమే సంఘ్‌ లక్ష్యం 1
1/2

దేశాన్ని పూర్వ స్థితికి తేవడమే సంఘ్‌ లక్ష్యం

దేశాన్ని పూర్వ స్థితికి తేవడమే సంఘ్‌ లక్ష్యం 2
2/2

దేశాన్ని పూర్వ స్థితికి తేవడమే సంఘ్‌ లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement