లక్కెవరికో!
ఎకై ్సజ్ డివిజన్ల వారీగా వచ్చిన దరఖాస్తులు
ఏర్పాట్ల పరిశీలన
నేడు కలెక్టర్ల సమక్షంలో మద్యం షాపు దరఖాస్తులకు డ్రా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మద్యం షాపుల టెండర్ దరఖాస్తులకు సోమవారం ఉదయం లక్కీడ్రా నిర్వహించనున్నారు. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఎంపిక చేసిన ఆయా కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. సరూర్‌నగర్, శంషాబాద్ డివిజన్లలోని మద్యం దుకాణాలకు శంషాబాద్ మల్లిక కన్వెన్షన్ సెంటర్‌లో డ్రా నిర్వహించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లలోని షాపులకు జూబ్లీహిల్స్ జేఎస్‌ఆర్ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. ఇక మేడ్చల్, మల్కాజ్‌గిరి డివిజన్లలోని షాపులకు పీర్జాదిగూడలోని శ్రీ పల్లవి కన్వెన్షన్‌లో, వికారాబాద్ డివిజన్‌లోని షాపులకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ భవన్‌లో నిర్వహించనున్నారు. దరఖాస్తుదారులు ఉదయం తొమ్మిది గంటలకే ఆయా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. తమ వెంట ఎకై ్సజ్‌శాఖ ఇచ్చిన రసీదులను తీసుకురావాల్సి ఉంది. ఒకవేళ దరఖాస్తుదారు లేనిపక్షంలో ఆథరైజేషన్ లెటర్ తీసుకొచ్చిన వాళ్లను మాత్రమే లోనికి అనుమతించనున్నారు. ఇదిలా ఉంటే దరఖాస్తుదారుల్లో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. సరూర్‌నగర్ డివిజన్‌లో 1,732 మంది, శంషాబాద్‌లో 1,351 మంది మహిళలు ఉన్నారు. లక్కీ డ్రాలో షాపులను గెలుచుకున్న వాళ్లకు డిసెంబర్ నుంచి మద్యం సరఫరా చేయనున్నారు.
ఎకై ్సజ్ డివిజన్ మద్యం షాపులు దరఖాస్తులు
సరూర్‌నగర్ 138 7,845
శంషాబాద్ 111 8,536
మేడ్చల్ 118 5,791
మల్కాజ్‌గిరి 88 6,063
హైదరాబాద్ 80 3,201
సికింద్రాబాద్ 99 3,022
వికారాబాద్ 59 1,808
వికారాబాద్ డివిజన్‌లోని షాపులకు అంబేడ్కర్ భవన్‌లో..
దరఖాస్తుదారుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు
షాపులను గెలుచుకున్న వారికి డిసెంబర్ నుంచి మద్యం సరఫరా
అనంతగిరి: వచ్చే రెండేళ్ల మద్యం పాలసీకి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 59 మద్యం దుకాణాలకు గాను మొత్తం 1,808 దరఖాస్తులు వచ్చాయి. కాగా డ్రా పద్ధతిన ఎంపిక ఉండటంతో సోమవారం వారి అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఇందుకు వేదికై న వికారాబాద్‌లోని అంబేడ్కర్ భవనాన్ని ఆదివారం జిల్లా ఆబ్కారీ శాఖ అధికారి విజయ్‌భాస్కర్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. దరఖాస్తుదారులు గంట ముందే వేదిక వద్దకు చేరుకోవాలని సూచించారు. దరఖాస్తుదారులు ఎంట్రీపాస్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. హాల్‌లోకి సెల్‌ఫోన్‌లు తీసుకురావడం నిషిద్దమన్నారు.


