
ఇసుక తరలిస్తున్న వాహనాల పట్టివేత
యాలాల: కాగ్నా నది నుంచి రాత్రివేళ ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఓ ట్రాక్టర్‌తో పాటు ఆటోను యాలాల పోలీసులు పట్టుకున్నారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని విశ్వనాథ్‌పూర్ శివారులో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో ఆదివారం రాత్రి తనిఖీలు నిర్వహించారు. అదే సమయంలో నదిలో ఇసుక లోడ్‌తో వెళుతున్న ఓ ట్రాక్టర్‌ను గుర్తించి పట్టుకున్నారు. మరోవైపు కోకట్ కాగ్నా నది నుంచి ఆటోలో సిమెంటు సంచుల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారు, ఆటో ఢీ.. భార్యాభర్తలకు గాయాలు
ఆమనగల్లు: ఆటోను కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ దంపతులు తీవ్రంగా గాయపడిన సంఘటన తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామశివారులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన భార్యాభర్తలు అశోక్‌రెడ్డి, సుమతమ్మ సోమవారం సమీపంలోని తమ వ్యవసాయ పొలంలో పచ్చిగడ్డి కోసుకుని ఆటోలో గ్రామా నికి వస్తుండగా ఆమనగల్లు నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆ టో కొద్ది దూరం వెళ్లి పల్టీ కొట్టడంతో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గుర్తించిన గ్రామస్తులు వెంటనే ఇరువురిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యా ప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతూ ఆర్టీసీ డ్రైవర్ మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని రాందాస్‌పల్లికి చెందిన కంతి కిషన్ (50) సోమవారం ఉదయం మృతిచెందాడు. ఇబ్రహీంపట్నం డిపోలో విధులు నిర్వర్తిస్తున్న కిషన్‌కు రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చించగా, చికిత్స పొందుతూ చనిపోయాడు. బీఆర్‌ఎస్ నాయకు మంచిరెడ్డి ప్రశాంత్‌కుమార్‌రెడ్డి, కొప్పు జంగయ్య తదితరులు మృతదేహం వద్ద నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.