
పెండింగ్ వేతనాల కోసం పెన్‌డౌన్
● ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు బహిష్కరించిన గెస్ట్‌లెక్చరర్స్
● ఆందోళన బాటపట్టిన
అతిథి అధ్యాపకులు
బొంరాస్‌పేట: మండల కేంద్రంలో నూతనంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటుతో హర్షం వ్యక్తం చేశారు. గతేడాది పరిగిలో కొనసాగిన కళాశాల ఈ ఏడాది మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ అదనపు తరగతి గదుల్లో ప్రారంభించారు. కాగా కళాశాల ప్రారంభం నాటి నుంచి తమకు వేతనాలు పెండింగ్‌లోనే పెట్టారని ఇక్కడ పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు నాలుగు రోజులుగా ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో బుధవారం విధులు బహిష్కరించారు. దీంతో కళాశాలకు వచ్చిన విద్యార్థులు కాలక్షేపం చేశారు.
పది మంది అడ్మిషన్లు వెనక్కు..
స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్‌తోపాటు ఇద్దరు రెగ్యులర్ అధ్యాపకులు, ఎనిమిది మంది అతిథి అధ్యాపకులున్నారు. రెండు తెలుగు, సోషల్ అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ 130 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారు. అధ్యాపకులు లేకపోవడంతో బోధన సాగడం లేదని పది మందికిపైగా విద్యార్థులు కళాశాలనుంచి వెళ్లిపోయారు.
కాలక్షేపం చేయాల్సి వస్తోంది
మా కళాశాలలో గెస్ట్ లెచ్చరర్స్ ఎక్కువగా ఉన్నారు. వారికి సమయానికి వేతనాలు రావడం లేదని బోధన చేయడం లేదు. దీంతో కాలక్షేపం చేయాల్సి వస్తోంది.
– మల్లేశం, బైపీసీ విద్యార్థి
బోధన చేయడం లేదు
లెక్చరర్స్ వేతనాలు రాకపోవడంతో తరగతులు బహిష్కరించారు. దీంతో మాకు బోధన కరువైంది. ఇంటర్ బోర్డు అధికారులు స్పందించి తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి.
– భూమిక, బైపీసీ విద్యార్థి

పెండింగ్ వేతనాల కోసం పెన్‌డౌన్

పెండింగ్ వేతనాల కోసం పెన్‌డౌన్