
ఇన్‌చార్జి ఎంపీడీఓ యాదగిరి
పౌష్టికాహారంతోనే ఆరోగ్యం
మోమిన్‌పేట: తల్లీపిల్లల ఆరోగ్యానికి పౌష్టికాహారం అవసరమని ఇన్‌చార్జి ఎంపీడీఓ యాదగిరి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని మోమిన్‌పేట పంచాయతీ కార్యాలయంలో పోషణ మాసోత్సవాల సంబురాల్లో భాగంగా చిన్నారులకు సామూహిక అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. తల్లీపిల్లల ఆరోగ్యానికి సహజ సిద్ధంగా లభించే వనరులపై ఆధారపడాలన్నారు. ఆకుకూరలు తప్పక తీసుకోవాలన్నారు. కూరగాయలు, పండ్లు, గ్రుడ్లు, పాలు నిత్యం స్వకరించడంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. బాలామృతంతో మానసికంగా, శారీరకంగా అభివృద్ధి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్లేశం, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పుష్పలత, శశికళ. పంచాయతీ కార్యదర్శి స్వప్న పాల్గొన్నారు.