
కళాశాలను తరలించొద్దు
కొడంగల్: ప్రభుత్వ మెడికల్ కళాశాల, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను కొడంగల్‌లోనే నిర్మించాలని సోమవారం సాయంత్రం పట్టణంలో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్య కార్యాచరణ కమిటీ(కేడీపీ జేఏసీ) ఆధ్వర్యంలో సంతకాలను సేకరించారు. కుల, మత వర్గ భేదం లేకుండా అందరి సహకారం కోరారు. కొడంగల్‌కు మంజూరు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను, గురుకులాలను కొడంగల్ శివారులోనే నిర్మించాలని పట్టణ వాసులు అన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధిలోని పాత కొడంగల్ గ్రామ శివారులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు గతంలో జిల్లా ఉన్నతాధికారులు భూమి పూజ చేశారని గుర్తు చేశారు. మండల పరిధిలోని ఎరన్‌పల్లి గ్రామ శివారులో మెడికల్ కళాశాల నిర్మాణానికి అక్కడి రైతుల నుంచి భూమి సేకరించారని అన్నారు. ఇంత చేసిన తర్వాత ఈ భవనాలను లగచర్లకు తరలిస్తున్నారని ప్రచారం జరగడం మంచిది కాదన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేడీపీ జేఏసీ కన్వీనర్ కొట్రికె లక్ష్మీనారాయణ గుప్తా, కో కన్వీనర్లు సురేష్‌కుమార్, శ్రీనివాస్, శాంతకుమార్, పవన్‌కుమార్, వెంకటయ్య, ప్రవీణ్, రఫీక్ తదితరులు పాల్గొన్నారు.
కేడీపీ జేఏసీ ఆధ్వర్యంలో
ప్రజాభిప్రాయ సేకరణ