
సముచిత స్థానం కల్పిస్తాం
డీసీసీ అధ్యక్ష పదవి కోసం అభిప్రాయ సేకరణ 16 వరకు దరఖాస్తుల స్వీకరణ ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు సూరత్‌సింగ్ ఠాకూర్
అనంతగిరి: పార్టీ కోసం పాటుపడిన వారికి పదవుల్లో సముచిత స్థానం కల్పిస్తామని ఏఐసీసీ జిల్లా పరిశీలకుడు సూరత్‌సింగ్ ఠాకూర్ అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని సత్యభారతి గార్డెన్‌లో డీసీసీ అధ్యక్ష పదవి కోసం అభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా సంఘటన్ సృజన్ అభియాన్ పేరిట కార్యకర్తలతో కలిసి వారి అభిప్రాయాల మేరకు డీసీసీ అధ్యక్షుల పేర్లను సేకరించి ఏఐసీసీ నాయకత్వానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. అధ్యక్ష పదవికి పోటీచేసే వారు ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తాను ఈనెల 19వ తేదీ వరకు జిల్లాలో పర్యటిస్తానని తెలిపారు. ప్రతి మండలంలో పర్యటించి అక్కడి నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను సేకరిస్తామన్నారు. సమావేశంలో పీసీసీ పరిశీలకులు బెల్లయ్య నాయక్, నీలిమ, వేణుగౌడ్, డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు ధారాసింగ్, రఘువీరారెడ్డి, మాజీ చైర్మన్ సత్యనారాయణ, డీసీసీబీ డైరక్టర్ కిషన్‌నాయక్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి చామల రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.