
కనుల పండువగా రథోత్సవం
పూడూరు: మండలంలోని పెద్ద ఉమ్మెంతాల్ గ్రామంలో కొలువుదీరిన తిరుమల నాథస్వామి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున రథోత్సవం వైభవంగా సాగింది. అనంతరం స్వామివారికి ఏకాంతసేవ నిర్వహించారు. భజన మండలి ఆధ్వర్యంలో సంకీర్తనలు ఆలపించారు. చిన్నారుల పాటలు ఆకట్టుకున్నాయి. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సతీష్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, డీసీసీ కార్యదర్శులు పెంటయ్య, శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్, మాజీ సర్పంచ్ శ్రీధర్, నాయకులు రఘునాథ్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గుపా, సుభాష్, వెంకటేశంగుప్తా, కృష్ణ, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.