
పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దు
అనంతగిరి: వరి ధాన్యం సేకరణలో ఎలాంటి పొరపాట్లకు అస్కారం ఇవ్వరాదని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు.. నిర్వహణపై సంబంధిత అధికారులతో సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. అవసరం మేరకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఐకేపీ, ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కొనుగోలకు అవసరమైన అన్ని యంత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. జిల్లాలోని రావులపల్లి, కోత్లాపూర్ చెక్ పోస్టుల వద్ద నిరంతరం తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ధన్యాం జిల్లాలోకి ప్రవేశించకుండా చూడాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ శ్రీనివాస్, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, సివిల్ సప్లయ్ అధికారి సుదర్శన్, డీసీఓ నాగార్జున, పౌర సరఫరాల సంస్థ మేనేజర్ మోహన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు.