
భూ సేకరణ పూర్తి చేయండి
అనంతగిరి: జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం నగరం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఎఫ్‌ఓ జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్
అనంతగిరి: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కి 158 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన అర్జీలను పెండింగ్‌లో ఉంచరాదన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మంగీలాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అందజేసిన సంజీవ్‌కుమార్
బంట్వారం: ప్రముఖ బిల్డర్ బంట్వారం వాసి మొగ్దుంపురం సంజీవ్‌కుమార్ సోమవారం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించి తిరుమల లడ్డూ ప్రసాదం అందజేశారు.
పరిగి: జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామిని సోమవారం పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. జిల్లా ప్రజలు సంతోషంగా ఉండాలని, పాడి పంటలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేను ఆలయ అర్చకులు శేషవస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

భూ సేకరణ పూర్తి చేయండి

భూ సేకరణ పూర్తి చేయండి

భూ సేకరణ పూర్తి చేయండి