
నూనె గింజల సాగుతో అధిక ఆదాయం
కొడంగల్ రూరల్: వ్యవసాయ అధికారుల సూచనలు పాటించడంతోపాటు నాణ్యమైన విత్తనాలు వాడి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం రైతులకు సూచించారు. సోమవారం మండలంలోని పెద్దనందిగామ గ్రామంలో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబ్లె ఆయిల్స్ – ఆయిల్స్ సీడ్స్(ఎన్‌ఎంఈఓ–ఓఎస్) పథకం కింద రైతులకు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేశారు. రైతులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నూనె గింజల ఉత్పత్తి పెరగడం ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుందని తెలిపారు. సాగు పద్ధతులను పాటిస్తూ సమయానికి విత్తుకోవాలని, ఎరువుల వినియోగం, పంట సంరక్షణ విధానాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏడీఏ శంకర్‌రాథోడ్, మండల వ్యవసాయాధికారి జి.తులసీ, ఏఈఓలు అశ్విని, సుమ, రాజు, ఐసాక్ హెరాల్డ్, శ్రీపతి, మాజీ సర్పంచు సంజీవరెడ్డి, రైతులు సత్యనారాయణరెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాజరత్నం