
బతుకమ్మ పాట ఆవిష్కరణ
నవాబ్‌పేట: ఎమ్మెల్యే కాలె యాదయ్య స్వగ్రామం చించల్‌పేటలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ‘తారాజువ్వా.. తంగేడు పువ్వా’ అనే బతుకమ్మ పాట – 2025 రూపొందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సోమవారం గ్రామంలో బతుకమ్మ పాట సీడీని ఆవిష్కరించారు. అంజిలప్ప రచించిన పాటను గాయని మమతా రమేశ్ పాడారని చెప్పారు. ఈ నెల 29న నిర్వహించే సామూహిక బతుకమ్మ సంబరాలు, వీడియో సాంగ్ చిత్రీకరణకు జోగు శ్యామలాదేవి, గాయని మమతా రమేశ్, సీనియర్ జానపద కళాకారుడు అశోక్ మాస్టర్, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రమేశ్ తదితరులు హాజరువుతున్నట్లు చెప్పారు. బతుకమ్మ సంబరాలకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు కాలె జయమ్మ, మాజీ ఎంపీపీ భవాని, గేయ రచయిత, గాయకుడు అంజిలప్ప, జానపద కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య, రవికాంత్ తదితరులు పాల్గొన్నారు.