
విస్తీర్ణం తగ్గింది.. దిగుబడి పెరిగింది
మండల వివరాలు
సంప్రదాయ పద్ధతులకు స్వస్తి
● ఆధునిక సాంకేతిక విజ్ఞానంతో అధిక లాభాలు
స్టేకింగ్ పద్ధతిలో టమాట సాగు
బెడ్ పద్ధతిలో పసుపు సాగు
మోమిన్‌పేట: ప్రతీ ఏడాది సాగు విస్తీర్ణం తగ్గుతున్నా దిగుబడులు నిలకడగా ఉంటున్నాయి. సంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక పద్ధతులు జోడించడంతో అధిక దిగుబడులు వస్తున్నాయి. కూరగాయల సాగులో బెడ్, మల్చింగ్, పందిరి, స్టేకింగ్, బిందు, తుంపర సేద్య పద్ధతులతో ఈ దిగుబడులు సాధ్యమవుతున్నాయని కర్షకులు వెల్లడిస్తున్నారు.
రెట్టింపు దిగుబడులు
బెడ్ పద్ధతిలో పసుపు సాగు చేపట్టడంతో ఎకరాకు 40క్వింటాళ్ల వరకు దిగుబడులు వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. ఆధునిక పద్ధతుల ద్వారా సాగుకు పెట్టుబడులు పెరిగినా.. దిగుబడులు రెట్టింపు రావడంతో ఇబ్బందులు లేవంటున్నారు. టమాట ఎకరాకు సాగు చేస్తే పది టన్నుల దిగుబడులు కష్టమే. కాని బెడ్, మల్చింగ్, ట్రేకింగ్ ద్వారా సాగు చేస్తే 50టన్నుల వరకు సాధ్యమంటున్నారు. పసుపు సాంప్రదాయ పద్ధతిలో ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల విత్తనం విత్తుకుంటే 12–15క్వింటాళ్లు గగనమే. కాని ప్రస్తుతం బెడ్, డ్రిప్ పద్ధతిలో తక్కువ విత్తనాలు విత్తుకున్నప్పటికీ 40క్వింటాళ్ల ధాన్యం దిగుబడి చేస్తున్నామని వివరించారు. సాగు విస్తీర్ణం సుమారు 12వేల ఎకరాలు తగ్గినా దిగుబడులు తగ్గడం లేదు. రైతులు పూర్తి ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి సాగు చేయడంతోనే సాధ్యమవుతుంది.
విస్తీర్ణం 45,142
పట్టభూములు 32,884 ఎకరాలు
ప్రభుత్వ భూములు 12,259 ఎకరాలు
సాగు విస్తీర్ణం 37,250 ఎకరాలు
23,500 (పస్తుతం)

విస్తీర్ణం తగ్గింది.. దిగుబడి పెరిగింది