
ఏటీసీలో సీట్లు భర్తీ
● విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు టాటా సంస్థ టెక్నీషియన్స్
● ఇప్పటికే విధుల్లో చేరిన నలుగురు అధ్యాపకులు
తాండూరు: పట్టణంలోని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్(ఏటీసీ)లో ఆరు కోర్సులకు సీట్లన్నీ భర్తీ అయ్యాయి. 172 సీట్లకు గాను పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులతో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇండస్ట్రియల్ రొబోటిక్ అండ్ డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ టెక్నీషియన్(ఒక సంవత్సరం), మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమెషిన్(ఒక సంవత్సరం, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్(ఒక సంవత్సరం), బీడీవీవీ వర్చువల్ ఎనాలసిస్ అండ్ డిజైనర్ (రెండేళ్లు), సీఎస్‌సీ మెషినింగ్ టెక్నీషియన్(రెండేళ్లు), ఎలక్ట్రిక్ వెహికిల్ మెకానిక్ (రెండేళ్లు) కోర్సుల్లో ఏటీసీ సెంటర్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. తొలుత దరఖాస్తులకు ఆసక్తి చూపకపోవడంతో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. దీంతో ఆరు కోర్సుల్లో అన్ని సీట్లు భర్తీ అయ్యాయని కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.సాయన్న తెలిపారు. మరో మూడు రోజుల్లో శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. 11 మంది అధ్యాపకులకుగాను(టెక్నీషియన్స్) ఇప్పటికే నలుగురు విధుల్లో చేరారని చెప్పారు.
జిల్లా స్థాయి టీఎల్‌ఎంకు బాటసింగారం పాఠశాల
అబ్దుల్లాపూర్‌మెట్: మండల కేంద్రంలో మంగళవారం బోధనోపకరణాల మేళా(టీఎల్‌ఎం మేళా)ను అట్టహాసంగా నిర్వహించారు. ఎంఈఓ జగదీశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ మేళాలో మండల పరిధిలోని 52 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు పా ల్గొని బోధనోపకరణాలను ప్రదర్శించా రు. ఇంగ్లిష్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన బాటసింగారం జెడ్పీహెచ్‌ఎస్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రకటించారు.