
చట్టాలపై అవగాహన అవసరం
దోమ: చట్టాలపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరమని షీటీం ఇన్‌చార్జి నర్సింలు అన్నారు. ఎస్పీ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మండల పరిధిలోని దిర్సంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌లో జీహెచ్‌ఎం రూప్‌సింగ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలతో పాటు గ్రామీణ ప్రాంత యువకులు, విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలు, బాల్య వివాహాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మహిళలు ఎలాంటి ఇబ్బందులకు గురైనా 100, 181కు కాల్ చేయాలన్నారు. మానవ అక్రమ రవాణా, మద్యపాన నిషేధాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలన్నారు. అన్‌లైన్ మోసాలపై అప్రమత్తత అవసరమన్నారు. గంజాయి, డ్రగ్స్ వినియోగాన్ని నిషేధించాలన్నారు. సైబర్ క్రైమ్‌లో ఎలాంటి మోసాలు జరిగిన 1930కి కాల్ చేయాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. శాంతియుత వాతవారణంలో ప్రజలంతా జీవనం సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో షీటీం సభ్యులు బి.సావిత్రి, ఉపాధ్యాయులు శివకుమార్, రాజు, రాము, విజయ, లావణ్య, ఎల్లారెడ్డి, రవీందర్, సర్దార్‌మియా, పీఈటీ గోపాల్, అనిత తదితరులు పాల్గొన్నారు.
షీటీం ఇన్‌చార్జి నర్సింలు