
పింఛన్ వెంటనే పెంచాలి
ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు
మల్లికార్జున
దోమ: ఎన్నికల సమయంలో ప్రభుత్వం ది వ్యాంగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమ లు చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు దివ్యాంగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం డీటీ నర్సింహులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా దివ్యాంగుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దాదాపు రెండేళ్లు కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. వెంటనే పింఛన్ మొత్తం పెంచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బందేయ్య, ఉపాధ్యక్షుడు వెంకటేశ్, వికలాంగుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు చుక్కయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్,కోశాధికారి లక్ష్మణ్, శ్రీ సంతోషిమాత విభిన్న ప్రతిభావంతుల సంఘం మండల మీడియా కన్వీనర్ కుర్వ ఆంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయం చేయండి
కొడంగల్: పట్టణంలోని పద్మావతీ సమేత శ్రీ మహాలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇళ్లు, ఇంటి స్థలాలు కోల్పోతున్న బాధితులు సోమవారం ఆలయ ఆవరణలో సమావేశమయ్యారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అధికారులు ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని, ఏ విషయం చెప్పడం లేదని ఆరోపించారు. జాతర స్థలంలో ఇంటి స్థలం ఇస్తామని అధికారులు చెబుతున్నారని అక్కడ బాగా లేదని తెలిపారు. ఆలయ విస్తరణలో భాగంగా ఆలయం చుట్టూ ఉన్న ప్రైవేటు స్థలాన్ని సేకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. ఆలయం చుట్టూ ఉన్న 96 మంది నుంచి 8,736 గజాల స్థలం సేకరిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారని అన్నారు.
రాష్ట్రస్థాయి పికిల్ బాల్
టోర్నీ విజేత జయశ్రీ
తాండూరు టౌన్: తెలంగాణ స్టేట్ ఓపెన్ పికిల్ బాల్ చాంపియన్‌షిప్ పోటీల్లో తాండూరు వాసి పటేల్ జయశ్రీ విజేతగా నిలిచి గోల్డ్‌మెడల్ సొంతం చేసుకున్నారు. ఈ నెల 13, 14వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో, 35 సంవత్సరాల వయసు విభాగంలో ఆమె ఈ ఘనత సాధించారు. బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ.. వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఆటల పోటీల్లో పాల్గొనాలన్నారు. నిత్యం వ్యాయామం చేస్తూ మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలన్నారు. త్వరలో జరగనున్న జాతీయ స్థాయిలో సైతం గోల్డ్ మెడల్ సాధించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. జయశ్రీని తాండూరు వాసులు అభినందించారు.
ప్రతి శిశువుకూ పోలియో చుక్కలు వేయించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: పుట్టిన ప్రతి శిశువుకు పోలియో చుక్కలు వేయించాలని అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లాస్థాయి పల్స్ పోలియో టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్‌రావు మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్ల లోపు 4.90 లక్షల మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. అక్టోబర్ 12న పోలియో బూత్‌ల్లో, 13 నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి ఆశ వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.

పింఛన్ వెంటనే పెంచాలి

పింఛన్ వెంటనే పెంచాలి