
సన్నద్ధంగా ఉండాలి
ఎస్‌ఐఆర్
నిర్వహణకు
అనంతగిరి: స్పెషల్ ఇన్సెంటీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) నిర్వహణకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. సోమవారం ఎస్‌ఐఆర్ – 2002పై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈఓ సుదర్శన్ రెడ్డి నగరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో 2002 ఓటరు జాబితాను 2025 జాబితాతో సరి చూసుకొని త్వరగా మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఈఆర్‌ఓ అలీకి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ట్రైనీ కలెక్టర్ హార్స్ చౌదరి, డీఆర్‌ఓ మంగ్లీలాల్, ఆర్‌డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నెమత్ హాలీ తదితరులు పాల్గొన్నారు.
సత్వరం పరిష్కరించాలి
ప్రజావాణి దరఖాస్తులను జాప్యం లేకుండా తక్షణం పరిష్కరించాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 103 దరఖాస్తులు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఆర్‌ఓ మంగ్లీలాల్, ఆర్‌డీఓ వాసుచంద్ర, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాగా 15 రోజుల నుంచి సెలవులో ఉన్న కలెక్టర్ సోమవారం తిరిగి విధుల్లో చేరారు.