
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
కుల్కచర్ల: స్థానిక సంస్థల ఎన్నికలకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాదరావు అన్నారు. ఆదివారం రాత్రి కుల్కచర్ల మండలం పుట్టపహాడ్ గ్రామంలో స్థానిక ఎన్నికలపై సన్నాహాక సమావే శం నిర్వహించారు.ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉందన్నారు. అనంతరం గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జక్లపల్లి కృష్ణయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటయ్య, దిశ కమిటీ జిల్లా సభ్యులు జానకీరాం, పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, నాయకులు చంద్రలింగం, కృష్ణయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.