
నేడు ఉత్తర్‌ప్రదేశ్ అధికారుల పర్యటన
అనంతగిరి: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, కన్సల్టెంట్‌లు శిక్షణలో భాగంగా జిల్లాలో ఈనెల 19 వరకు పర్యటించనున్నారని అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) సుధీర్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండలంలోని పులుమద్ది(ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు), నవాబ్‌పేట మండలం లింగంపల్లి గ్రామంలో మధ్యాహ్నం 2 నుంచి పర్యటిస్తారన్నారు. అక్కడ పలువిషయాలపై చర్చించి, పరిశీలిస్తారని తెలిపారు.
ఇసుక అక్రమంగా తరలిస్తే చర్యలు
యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి
యాలాల: ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని యాలాల ఎస్‌ఐ విఠల్‌రెడ్డి హెచ్చరించారు. ఆదివారం అర్ధరాత్రి మండల పరిధిలోని దుబ్బతండా సమీపంలోని కాకరవేణి నది నుంచి రెండు ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్నారు. గమనించిన పోలీసులు వాహనాలు ఆపి తనిఖీలు చేపట్టగా ఎలాంటి అనుమతులు లేవు. దీంతో వాహనాలను సీజ్ చేసి ఠాణాకు తరలించారు. డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
డ్రైనేజీ గుంతలో పడిన కారు
తాండూరు టౌన్: అదుపు తప్పిన ఓ కారు సరాసరి నిర్మాణంలో ఉన్న డ్రైనేజీ గుంతలో పడింది. ఈ ఘటనలో కారు నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సోమ వారం తెల్లవారుజామున కొడంగల్ వైపు నుంచి పట్టణంలోని ఇందిరాచౌక్ వైపునకు వచ్చిన కారు డ్రైనేజీ నిర్మాణం కోసం తవ్విన గుంతలో అదుపు తప్పి పడిపోయింది. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉండటం వల్ల ఈఘటన జరిగినట్లు తెలిసింది. అతను స్వల్ప గాయాలతో బయటపడగా, అనంతరం కారును క్రేన్ సహాయంతో బయటకు తీశారు.
యఽథేచ్ఛగా మట్టి దందా!
దోమ: అనుమతులు లేకుండానే పట్టపగలే యఽథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నారు. సోమ వారం దోమ మండల పరిధిలోని మల్లేపల్లి తండా సమీపంలోని ఓ ప్రభుత్వ భూమిలో మట్టి దందాను కొందరు వ్యాపారులు ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. జేసీబీల సహాయంతో ట్రాక్టర్లలో నింపి అమ్ముకుంటున్నారు. సంబంధిత రెవెన్యూ, పోలీస్ అధికారులకు విషయం తెలిసినా కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌ను వివరణ కోరగా ఆమె స్పందించ లేదు.
ధరల బోర్డు ఏర్పాటు
బషీరాబాద్: మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల ఎదుట ధరల పట్టిక బోర్డులు ఏర్పాటు చేశారు. యూరియా మొదలుకొని డీఏపీ, ఇతర ఎరువులు ఫర్టిలైజర్ షాపుల యజమానులు అధిక ధరలకు విక్రయిస్తున్నారని ‘సాక్షి’లో కథనం రావడంతో సోమవారం పట్టిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఇందులో యూరియా బస్తా ధర మొన్నటి వరకు రూ.320 నుంచి రూ.350కి విక్రయించగా ప్రస్తుతం దాని ధర రూ.266గా, డీఏపీ 1,450 నుంచి 1,350కి దిగి వచ్చాయి. అలాగే (20–20) కాంప్లెక్స్ ఎరువులు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు దిగివచ్చాయి. ఇన్నాళ్లు తమ దగ్గర ఎరువుల షాపుల యజమానులు ఒక్కో బస్తా ఎరువుకు రూ.80 నుంచి రూ.100 వరకు అధనంగా వసూలు చేశారని రైతులు తెలిపారు. మరోవైపు అధిక ధరలకు అమ్మిన ఓ షాపు యజమానికి రేపటి వరకు సమాధానం ఇవ్వాలని షోకాజ్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

నేడు ఉత్తర్‌ప్రదేశ్ అధికారుల పర్యటన

నేడు ఉత్తర్‌ప్రదేశ్ అధికారుల పర్యటన

నేడు ఉత్తర్‌ప్రదేశ్ అధికారుల పర్యటన

నేడు ఉత్తర్‌ప్రదేశ్ అధికారుల పర్యటన