
తాగునీటి సమస్య పరిష్కరించండి
యాలాల: వారం రోజుల నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడంతో పలు గ్రామాల్లో తాగునీటికి ఇబ్బందిగా మారిందని, వెంటనే పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మిషన్ భగీరథ నీటి సరఫరా లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఇబ్బందిగా ఉందన్నారు. ఈ విషయంలో ఎంపీడీఓ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు సమన్వయంతో సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెట్లి కృష్ణ, నర్సింహులు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్కయ్య